Saturday, December 8, 2018

Kalla you tube interview

Kalla by Prasen Bellamkonda

మీరు 'ఆర్ట్ ఎటాక్ ' తో చనిపోతారు అని కాళ్ల గారితో నలభై ఏళ్ల క్రితం అనుకుంటా అన్నాను.
అప్పట్లో ఏదో గొప్ప పద ప్రయోగం చేసానన్న చాపల్యం తప్ప ఆ వాక్యం వెనుక ఏ ఎమోషనూ లేదు.
ఆయనకు కన్నీళ్లూ కండొలెన్సులూ రిప్పులూ శ్రధ్దాంజలులూ నచ్చవు. తిక్క కదా. అంతే.
రిక్షా తొక్కుతూ కూడా గతితార్కిక భౌతికవాదం చదివే తిక్క కదా. అంతే.
పెళ్లిది పసుపు, ఏడుపుది నలుపు, సంబరానిది తెలుపు.... మరి మ్రుత్యువుదే రంగు.
ఆయన బొమ్మల్లో ఎవరైనా వాళ్లను వాళ్లు వెతుక్కుని వెంటనే వాళ్లను వాళ్లు కోల్పోవాల్సిందే. తిక్క కదా . అంతే.
నా రెండు పుస్తకాలకూ కవర్ డిజైన్ ఆయనే..నాకూ తిక్క కదా. అంతే.
గత నలభై రెండేళ్లుగా ఆయన మాటను అబద్దం చేసేందుకు నేనూ నా మాటను అబద్దం చేసేందుకు ఆయనా ప్రయత్నిస్తూనే ఉన్నాం.
చిట్ట చివరకు మాత్రమే నా మాట నిజం చేసి పేరుకు జ్వరం ముదిరిందే కానీ నిజానికి ఆర్ట్ ఎటాక్ తోనే వెళ్లిపోయారు.
రంగులకు ఆల్టర్ ఈగో ఆయన.
తిక్క కదా. అంతే.


Kalla by Surendra cartoonist

పో!పోతే పో..
ఇంకో ఇరవై యేళ్ళు ఉంటానని అన్న వారానికే బయల్దేరేశావ్. నీకేం, ఇస్త్రీ బట్టలు సర్దుకునేదుందా,సేవింగ్ సెట్ పెట్టుకునేదుందా,ఏటీఎం కెల్లేదుందా...ఉన్నపాటున బయల్దేరగలవ్.
ఎవరున్నారు నిన్ను భరించే వాళ్ళక్కడ? ఇక్కడైతే నేనో, శీనో ఉన్నాం.రాత్రుల్లంతా పాటలు వింటూ, మాటాడుకుంటూ, ఇప్పుడు పోతే మీరు మళ్లీ రారంటూ ప్రతినిమిషాన్ని జుర్రుకునేందుకు ఎవరున్నారక్కడ? సరే..పో! ట్రై చెయ్..నిన్నెవరు భరిస్తారక్కడ? పగలంతా శ్రద్ధగా
వింటావ్, రాత్రయిందా...పగలైతే దొరవేరా..రాతిరి నా రాజువురా..
రాజు తలుచు కుంటే కొరడా దెబ్బలకేం కొదవ?నువ్వది చేయలేదు, ఇదిచేయలేదు" అబ్బబ్బా..నిన్ను భరించడం కష్టం. ముప్పైతొమ్మిదేళ్ళు
ఏం మాటాడుకున్నాం..ఏమీ గుర్తు రావడం లేదే.సర్ ప్రైజ్ ఇద్దామని

చెప్పా పెట్టకుండా లెక్క లేనన్ని సార్లు ఇంటికొస్తే, ఏ మాత్రం ఆశ్చర్యపడకుండా..దా.. బాబూ..ఏమన్నా తిన్నావా.. అనడుగుతావ్.
నీ పాసుగూలా ఇదేందయ్య అంటే, "నువ్వు, శీను ఈ ఇంట్లో లేందెప్పుడయ్యా" అంటావ్.
అవన్నీ ఇప్పుడెందుకులేగానీ..కలిసినప్పుడు మాటాడుకుందాం.


Kalla smruthi- Eeluru invitation[shared by Gangahar rao kadupu]

ఆహ్వానం

ప్రముఖ చిత్రకారుడు కాళ్ళ సత్యనారాయణ సంస్మరణసభ ది 9-12-2018 ఆదివారం సాయంత్రం 5 గంటలకు చైతన్యవేదిక ఆధ్వర్యంలో ఏలూరులోని "స్ఫూర్తి భవన్"(సి పి ఐ ఆఫీస్ )లో జరుగుతుంది  4 గంటల నుండి"కాళ్ళ చిత్ర ప్రదర్శన "జరుగుతుంది
కావున కాళ్ళ మిత్రులు, బంధువులు, చైతన్యవేదిక మిత్రులు సకాలంలో హాజరు కావల్సిందిగా కోరుచున్నాము

ఆర్. ఎస్. డాంగే
కార్యదర్శి
చైతన్యవేదిక, ఏలూరు


Kalla interview _Andhra jyothi_13 feb 2005[shared by Uma tenali]

Kalla in his 20's[pic shared by Surendra cartoonist]


Kalla smruthi - Tenali invitation by Uma Tenali


Sunday, December 2, 2018

ధన్యవాదాలు

కాళ్ళ స్మృతి
-------------
కాళ్ళ స్మృతిలొ పాల్గొని, చిత్ర కళను, ఆయనతొ అనుబందాన్ని తలచుకుని నివాళి అర్పించిన మిత్రులందరికి ధన్యవాదాలు.















Kalla paintings[shared by Tenali Uma]