Saturday, December 1, 2018

Kalla paintings[shared by Kamalakar reddy , gurram Seetaramulu and others]

































Kalla nude paintings[shared by Kamalakar reddy]














Karl marx painting by Kalla[shared by Gurram seetaramulu]


kalla by Kopparthi [poet]


ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించండి. కిందిది  కాళ్ల గారు నా తొలి కవిత్వసంపుటి 'పిట్టపాడేపాటకోసం' కు 1991 లో వేసిన ముఖచిత్రం. అవి కవిత్వసంపుటాలకు కాళ్ల గారి ముఖచిత్రాల హవా ప్రారంభమైన రోజులు. అప్పటికే మో, పాపినేని, అఫ్సర్ వంటి కవుల సంపుటులకు ఆయన ముఖచిత్రాలు రావడంతో నేనూ వేయించుకోవాలని ఇష్టపడ్డాను. ఖమ్మం లో వుంటారని తెలిసి గంగాధర్ గారూ నేనూ వెళ్లాం. కాదు కాదు గంగాధర్ గారు నన్ను తీసుకెళ్లారు( తమ చిన్నప్పటి ముచ్చట్లు చెబుతూ). ఆచిన్న స్టుడియో లోనే కలిశాం. కొన్నికవితల్ని ఇస్తూ 'పిట్టపాడేపాటకోసం' కవితకు అనుగుణంగా బొమ్మ వేసివ్వమని అడిగి వచ్చేశాం. రెండు మూడు నెలలకుపైగా ఎదురుచూసినా బొమ్మరాలేదు. ఆలస్యం ఐపోతూండడంతో మళ్లీ గంగాధర్ గారి పనుపు మీదా, జయధీర్ తిరుమల్రావు గారి సహకారం తో మోహన్ ను కలిసి, ఒకరోజంతా ఆయనతోనే వుండి బొమ్మవేయించుకుని ఇల్లుచేరానో  లేదో కాళ్ల గారినుంచి బొమ్మ వచ్చింది. ఐతే నేనడిగిన బొమ్మకాకుండా నేనిచ్చిన కవితల్లో  ఆయనకు నచ్చిన 'ఆకలి నైరూప్యంకాదు' కవితకు బొమ్మవేసి పంపారు. ఏంచెయ్యాలో తోచలేదు. Title మార్చడం నాకిష్టం లేదు. బొమ్మ వేసుకోకుండా కాళ్లగారిని అవమానపరచడమూ ఇష్టం లేదు. ఈ సందిగ్ధం లో మోహన్ గారి బొమ్మనేంచెయ్యలో తెలీలేదు. చివరికి ముగ్గురికీ న్యాయం జరిగేటట్టు title అలాగే వుంచి కాళ్ల గారి బొమ్మతో, మోహన్ అక్షరాలతో పుస్తకం వేసాను. చూసేవాళ్లకు కొంత గందగోళం కలిగించేటట్టున్నా చిత్రకారులిద్దరినీ అగౌఅరవపరచలేదనే తృప్తి మిగిలింది. పిట్టపాడేపాట ను కాదని నైరూప్యమైన ఆకలికి రూపం ఇవ్వడంలోనే కాళ్ల గారి స్వభావమూ, ఆయన కుంచె లోని అభావమూ ఇమిడి వున్నాయి. కాళ్ల, మోహన్ గార్లకు అంజలి !!

kallla- Khader mohiyuddin [poet]

శాతవాహన అలియాస్ గులాం గౌస్, గుంటక రామిరెడ్డి, నేనూ విజయవాడ, మారుతీ నగర్ లో వుండేవాళ్ళం. కాళ్ళ వేసిన మార్క్స్, ఏంగెల్స్ పెయింటింగ్స్ చాలా కాలం మా ఇంట్లోనే ఉన్నాయి. మా గురించీ, ఇంటి గురించీ 'మో' తన బతికిన క్షణాలులో ... కాళ్ళ వేసిన మార్క్స్ పెయింటింగ్ అల్మారాలో అడ్డంగా పడుకుని వుంటుంది. దాని గడ్డం రోజురోజుకీ పెరుగుతూ వుంటుంది అని రాశారు.
-----------------
ఇది అన్న కాళ్ళ సత్యనారాయణ దాదాపు మూడు దశాబ్దాల పాటు భద్రపరచి షష్టిపూర్తి సందర్భంగా బహూకరించిన ఫొటో... అన్న సత్యనారాయణతో
నా అనుబంధం అతి సుదీర్ఘం... అతి సున్నితం... ఆ వివరాలను ప్రపంచం ముందు పరచకుండా వుండటమే ఆయన స్మృతికి నేను అర్పించగల నివాళి...


కాళ్ల స్మృ తులు by రవి అడబాల[Advocate-Hyderabad]

కాళ్ల స్మ్రు తుల లింకు వచ్చాక, కాళ్ల నాకు తెలుసు అని చెప్పడానికి తప్పించి అందరితో పంచుకునే గొప్ప జ్ఞా పకాలు గుర్తుకు రాలేదు. ఇది ఇలా వుండగా;
నిన్నటి నుండి మా టూర్ లో (Havelock, Andamon Islands,dt.27-11-2018).మాతో పాటు ఒక యువకుడు కలిసి తిరుగుతున్నాడు.
అతను "నాకు సినిమా డైరెక్షన్ ఇష్టం. శిక్షణ తీసుకున్నాను" అన్నాడు.
ఏ బాషలో సాహిత్యం చదువుతున్నారు అన్నాను
"చలం పుస్తకాలు చదవ మన్నారు. కొన్ని చదివా ! నాకు నచ్చలేదు" అన్నాడు
పరుచూరి బ్రదర్స్ కథ, స్క్రీన్ ప్లే గురించి వెబ్ లో చేప్పుతున్నారు. విన్నారా? అన్నాను.
"అవన్నీ ప్రాథమిక విషయాలు. నాకు తెలుసు" . అన్నాడు.
అయితే;

ఫైట్ , ఏక్షన్ సినిమాలు తీ స్తారా అన్నాను.
"శేఖర్ కమ్ముల లాగా తీస్తాను" అన్నాడు.
దేనికైనా కథ కదా......................... అనే లోపులో అక్కడ నుండి సెల్ ఫొన్ వచ్చినట్టు నటించి వెళ్లి పోయాడు.
ఈ సంభాషణ మూడు సందర్భాలలో 5 నిమషాలు మాత్రమే జరిగింది.
వెంటనే కాళ్ళ నా జ్ఞాపకాల నుండి బయటకి వచ్చాడు.

కాళ్ల 1972 జనవరి నుండి తెలుసు. నాకన్నా వయసులో పెద్దవాడు. ఏక వచనం లో పిలుచుకొనే పరిచయం మాది .  అప్పుడు AISF, AIYF లు యువజన ఉస్సవాలు జరిపాయి. అవి విజయవంతం అవ్వడం లో ప్రముఖ పాత్ర వహించాడు. నేను అప్పుడు నాది హైస్కూల్ లో చదువు
పాటలు పాడేవాడు. డాన్స్ చేసేవాడు. బొమ్మలు గీసేవాడు. పుస్తకాలు చదివేవాడు.
అన్నింటికన్నా చిన్నగా అర్థం అయ్యే లా  మాట్లాడేవాడు.
ముఖ్యంగా చెప్పేది శ్రద్ధగా వినేవాడు.
అలా స్నేహితుడు అయ్యాడు. పార్టీ పనులు చేసేటప్పుడు నేను కాళ్ల తో పాటే ఉండే వాడిని.
చాలా సార్లు పోస్టర్లు అంటించడానికి ఇద్దరం వెల్లేము.

నా చిన్న వయసులో (8 నుండిి -  ఇం టరు )   ప్రతీది తెలుకోవాలనే ఉస్త్సుక త ఉండటం వల్ల ;
ని దానంగా మాట్లాడే వాడు
ఓపిగ్గా వినేవాడు
కాళ్ల
అవ్వడం వల్ల
స్నేహం కలిసింది

కాళ్ళకి ఆకర్షించే గుణాలు ఉన్నాయి.
కాచి పూసిన ఇనుము లాగా  దృఢంగా శరీరం. చురుగ్గా చూసే కళ్ళు. వేగంగా స్పదించే చేస్ట లు. పైగా పాటలు పాడతాడు. బొమ్మలు వేస్తాడు. ఓపిగ్గా వింటాడు. అందుకే అతని వెంటపడటం
ఏ పని అయినా చాలా వేగంగా నేర్చుకొనే వాడు.
తనకి తెలిసిన విద్యని దాచుకో కుండా  నేర్చుకునే విధానంలో చెప్పే వాడు.

తను రిక్షా తొక్కెడు
బట్టలు నేసాడు
జూట్ మిల్లులో కూలీగా చేశాడు
మేము చాలా రోజులు జుట్ మిల్లు దగ్గర సగం కట్టేసి వదిలేసిన వంతెన మీద కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళం
సాయంత్రము 4 గంటల నుండి చాలా  రాత్రి వరకు సాగేది మా సంభాషణ.
టీ 10 పైసలు. అవి కూడా అప్పుడప్పుడు ఉండేవి. వీలైనన్ని టిలు తాగే వాళ్ళం

 కాళ్ల ఇల్లు ఏ టీ వడ్డున ఉండేది. లోపల వెదురు కర్రలతో చేసిన స్టాండ్ దానికి బోర్డ్, చార్ట్ ఉండేవి. కొన్ని పుస్తకాలు ఉండేవి. బొమ్మలు వేస్తూ ఉండే వాడు. చిత్రలేఖనం తనకి సహజంగా అబ్బిన కళ. దానిని నిరంతరం సాధన చేసి చివరి వరకు నిలబెట్టేడు. జీవన పోరాటం లో చివరి వరకు ఆసక్తిని కొనసాగించడం కష్టం

శ్రీశ్రీ అనువదించిన మైకివ్ వస్కి కవితల్లో ఒకటి అయిన"త్వరలోనే లేస్తాడొక మనిషి" కి చక్కటి బొమ్మ వేశాడు. కాళ్ల గురించి పొగడ్తలు అన్నీ స్వచ్ఛ మైనవి. పొగిడి లబ్ధి పొందలేరు. ఆయన ఎవర్ని ఆశ్రయించి బ్రతక లేదు.

కాళ్ళకి వామపక్ష భాజాలం ప్రసాదించింది ఏ లూరు కమ్యూ నిస్ట్ పార్టీ. ఆ రోజుల్లో  అనేకమంది మిత్రులు సాహిత్య అభిలాష కలిగి ఉండేవారు. సాహిత్య చర్చలు జరుగుతూ ఉండేవి. పీకాక్ గాంధీ గారి tutorial college మిత్రులందరికీ మీటింగ్ పాయింట్. రష్యన్ సాహిత్యం తో పాటు తెలుగు అభ్యుదయ సాహిత్యం అందరి దగ్గర కాస్త కాస్త ఉండేవి.

ఏ లూర్ పార్టీ ఆఫీస్ లో లైబ్రరీ ఉండేది. 
గంగాధర రావు గారు ప్రభుత్వ లైబ్రేరియన్ అవ్వడం వల్ల కూడా మంచి పుస్తకాలు గురించి తెలిసేది. ఆవిధంగా కాళ్ల తాత్వికత కి తన జీవన పోరాటం ప్రాణం పోస్తే కమ్యు నిష్ట్ పార్టీ, మిత్రులు వలన  వామపక్ష భావజాల సౌష్టం కలిగింది. కాళ్ల మిత్రులలో గాంధీ,మోహన్,గంగాధర్, సం జీవరావు,దుర్గారావు గార్లు ముఖ్యులు.ఆనాటి పార్టీ నాయకులు సర్వేశ్వర రావు, ఇందుకూరి సుబ్బరాజు,వర్మ గార్లతో కాళ్ళకి మాంచి సంభందాలు ఉండేవి.

కాళ్ల గురించి చెప్పుకుంటే.. ఉత్తర్రవు గారి గురించి చెప్పుకోవాలి. ఆయన కూడా కాళ్ల కి ఉన్న అన్ని లక్షణాలు ఉన్నాయి. కలిసి అనేక బొమ్మలు వేశారు. అనేక సాంస్కృతిక కర్యక్రమాలు జరిపారు.  ఆయన ప్రభావం కూడా కాళ్ల మీద ఉంది.
మిత్రులు అందరికి సంధానకర్తగా వ్యవహరించే రమణ గురించి చెప్పకపోతే కాళ్ల ఏ లూరూ జీవితం అసంపూర్ణం అవుతుంది. ఇ ద్దరూ ఇ ప్పూడు లేరు

 నేను , కాళ్ల కలసి రాజకీయ శిక్షణా తరగతులకు రాజమండ్రి, కొవ్వూరు,తెనాలి వెళ్లాం. పార్టీ 10 వ మహాసభల కి విజయవాడ వెళ్లాం. దానికి జరిగిన సన్నాహాలు కి కాళ్ల చాలా శ్రమించాడు.
: ఎంతో మంది మనుషులని ఓడపోస్తే మిగిలిన కొద్ది మందిలో కాళ్ల ఒకడు. గురువు అంటే ఒడుపు ,సులువు నేర్పేవాడయి ఉండాలి.
కథ ఎ లా రాయాలి అని చర్చించుకునే ట ప్పుడు , కథ రాయడం నేర్చుకోవడానికి ఒకసారి సులువైన మార్గం చెప్పాడు. కార్డు సైజ్ కాగితం మీద రోజు ఒక కథ రాసి తనకి చూపించ మన్నాడు. చిన్న చిన్న లక్ష్యాలతో పెద్ద లక్ష్యం సాధించవచ్చని ఆయన ఉద్దేశ్యం

 నేను సినిమా కథ, స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకున్న ప్పుడు  ఒక సలహా ఇచ్చాడు. "పుస్తకాలు చదివి ఏ పని చెయ్యలేము.  సాధన చెయ్యాలి. ఒక సినిమా చూసి,చూసి దాని కథ రాయి. తరువాత సంభాషణలు రాయి. అవే సీన్లు గా రాయి. సందేహం వస్తే అదే సినిమా మళ్లీ, మళ్లీ చూడు" అన్నాడు.
ఇదే విషయం చాలా వారాలు పాటు మాట్లాడుకున్నాం. అది కాళ్ల శిక్షణ ఇచ్చే పద్దతి. ఒక సాధకుడికి ఉండే లక్షణం . తన ఆలోచనలు పంచుకోవడం.

నేను1987 అక్టోబర్ తరువాత 30 ఏ ల్లు కాళ్ళని  చూడలేదు. సెల్ ఫోన్లు వచ్చాక అప్పుడప్పుడు మాట్లాడా!
ఈ మధ్య జయితి ("అడవి నుండి అడవికి"  రచయిత్రి ) గారి ఇంట్లో కలిశాం. ఏ మీ మారలేదు. అవే మాటలు,చలోక్తులు. నా బట్ట తల చూసి ఏ మిట ఇలా అన్నాడు. 60 కదా అన్నాను గర్వంగా... ఇ క్కడ డబ్బై అన్నాడు ఇంకా పూర్తిగా ఊడని తన జుట్టు చూపిస్తూ.
అది హైదరాబాద్ కి దూరంగా ఉన్న చిట్టి అడవి ప్రాంతం. చాలా సేపు సైకిల్ తొక్కాడు. జయతి గారి మటన్ సూపు, గంగాధర్, బత్తుల అనిల్ వండిన రొయ్యల కూరతో భోజనం ముగించాం.
"రవీ! ఈ రోజు చాలా హాయగా ఉంది." అన్నాడు.
మళ్లీ నీ ల (తానా బహుమతి పొందిన పుస్తకం, రచయిత్రి: మల్లేశ్వరి)పుస్తక పరిచయం రోజున ఏ లురు లో కలిశాం. ఆ రోజు రాత్రి ఏ టిగట్టున చాలా రాత్రి వరకు మాట్లాడుకున్నాం. ఇప్పటికీ తగ్గట్టుగా లేటెస్ట్ గా ఉన్నాడు. అదే భావ వ్యక్తీకరణ. మాటలు కొలిచినట్టు మాట్లాడటం, శ్రద్ధ గా వినడం , జ్ఞాప కాలని ప్రస్తావించడం   అవి మారలేదు.
ఆయన ఖమ్మం జీవితం తెలీదు.

ప్రస్తుతం నేను హైదరాబాద్ లో అడ్వకేట్.

కాళ్ల అన్నీ కిక్ వచ్చే పనులే చేసి క్విక్ గా వెళ్ళిపోయాడు.
దూరంగా ఉండటం విచారం. దూరంగా వెళ్లి పోవడం విషాదం
కాళ్ళ
నాకు   స్నేహితుడు, గురువు అయినందుకు గర్విస్తున్నాను.

Kalla send off - shared by Uma rajashekhar