Tuesday, November 26, 2019

Kalla 1st vardhanti-Eeluru, kalla gurthulu book release

Write up by Srama gundimedas...

ఏలూరు:
ప్రసిద్ధకళాకారుడు, కాళ్ళసత్య నారాయణ రావు కళా రూపాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్లడంలో నిరంతరం కృషిచేశారని పలువురు వక్తలు నివాళులర్పించారు.
స్థానిక మోతేవారి తోటలో చైతన్యవేదిక, చందమామ గ్రంథాలయం సమయుక్త.ఆధ్వర్యం కాళ్ల సత్యనారాయణ సంస్మరణ సభ ఆదివారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా కాళ్ల గుర్తులు పుస్తకాన్ని ప్రముఖ చిత్రకారుడు, పాత్రికేయులు తల్లావఝుల శివాజీ ఆవిష్కరించారు. చందమామ గ్రంథాలయం ఆధ్వర్యంలో ఈ పుస్తకాన్ని ప్రచురించారు.
సభలో తల్లావఝుల శివాజీ మాట్లాడుతూ చిత్రకారుడుగా, నటుడిగా, కళాకారుడిగా సమాజంపై కాళ్ల గుర్తులు చిరసస్మరణీయమన్నారు. తన చిత్రాల ద్వారా ప్రజల సమస్యలను ముందుకు తీసుకెళ్లిన కళాకారుడు కాళ్ల అని ఆయన అన్నారు. కళాకారుడిగా కాళ్ల చిత్రీకరించిన చిత్రాలు అద్భుతమన్నారు.చిత్రకారునిగానే కాక ప్రజానాట్యమండలి కళాకారుడిగా కాళ్ల ప్రజల కోసం పోరాడారని గుర్తు చేసుకున్నారు
ప్రముఖ సాహిత్యవేత్త కొమ్మన రాధాకృష్ణ మాట్లాడుతూ చందమామ గ్రంథాలయం ద్వారా ప్రచురించిన రెండవ పుస్తకం కాళ్ల గుర్తులు పుస్తకమని అన్నారు.తనకళ ద్వారా ప్రజా సమస్యల్ని వెలుగులోకి తేవడంలో కాళ్ల చేసిన కృషి మరువ లేనిదని నివాళులర్పించారు., ఏలూరు పికాసో అకాడమీ స్థాపకులు ఎం.రాంబాబు, మాజీ గ్రంథాలయాధికారి కడుపు గంగాధర రావు, చైతన్యవేదిక నాయకులు వాకాడ రాజారావు, పిఎస్ చందు, తదితరలు ప్రసంగించారు.











No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.