శ్రీ కమలాకర్ రెడ్డి గారి జ్ఞాపకాలు కాళ్ళ గారి గురించి....
కాళ్ళ గారు - 1 వ భాగం.
ప్రముఖ రచయిత శ్రీ చావా శివకోటి గారిని వెనకేసుకుని తిరగడం 2013 నుండి అలవాటయ్యింది. ఆయన ఎక్కడికి వెళ్దామన్నా "ఎక్కడికి" అని అడగకుండా... బండెక్కి కూర్చున్న ఆయన చేత రూట్ చెప్పించుకోవడమే అలవాటయిన కొత్తరోజులవి (ఇప్పటికి కూడా అంతే). ఆయనతో తిరగడమే ఒక "ఎడ్యుకేషన్" లా ఫీల్ అవుతున్నవాడిని.
ఒకరోజు ఇద్దరం ఏవేవో కబుర్లాడుకుంటుంటే... "అరేయ్ రెడ్డి... రేపు కాళ్ళ దగ్గరకెళదాం" అన్నారు శివకోటి గారు. "సరే తాత"అన్నాను. అప్పటికి నాకు "కాళ్ళ" ఎవరో తెలియదు. నేను అడగకుండానే "వాడో అద్భుత చిత్రకారుడు. చిన్న బొమ్మలతో పెద్ద కథలు చెప్పగలడు. కానీ బతకడం చేతకాని నికార్సయిన మనిషి.... రేపు జరపబోయే హరీష్ సంస్మరణ సభ కరపత్రికకు కాళ్ళ చేత ఒక చిన్న బొమ్మ వేయిద్దాం" అని కాళ్ళ గారు ఎవరో? ఎందుకు కలవాలో చెప్పారు శివకోటి గారు. రచయితలన్నా... చిత్రకారులన్నా... భలే ఇష్టం నాకు. నాలుగు గీతలతో నాలుగు వేదాలు చెప్పగల సత్తా ఉన్న చిత్రకారులంటే ఇష్టం కన్నా.. ఇంకేదో భావన. ఎందుకంటే కథలో సారం "చదవడం" ద్వారానే తెలుసుకోగలం. అదే బొమ్మయితే చూడటం ద్వారా.., కేవలం చూడటం తెలిస్తే చాలు. పండితులనే కాదు, పామరులను కూడా రంజింపచేసేది "బొమ్మ" అనే భావన నాది. అందుకే "బొమ్మలోళ్లంటే" భలే ఇష్టం. "మరి కాళ్ళ గారు ఎన్ని రోజుల్లో గీస్తారు తాత?" తెలియక అజ్ఞానం కొద్దీ అడిగాను.
"ఎన్ని రోజులా? అలా గీసిస్తాడు రా... కాళ్ళ మామూలోడు కాదు" అంటూ చేతిలో లేని కుంచెను గాల్లో తిప్పి చెప్తే ఆయన ను ఎప్పుడు చూద్దామా అని ఒకటే ఇదయిపోయాను.
ణెక్ష్త్ దయ్ కాలేజ్ అయిపోగానే శివకోటి గారి దగ్గరకు వచ్చి "కాళ్ళ గారి దగ్గరకు వెళదాం పద తాత" అంటే... 75 సంవత్సరాల వయసులో జీవితాంతం ప్రాణం లో ప్రాణం లా మెలిగిన స్నేహితుడు "డా.హరీష్" గారి సంస్మరణ సభ నిర్వహించాలానే తపన ఉన్న శివకో
టి గారు ఉత్సాహంగా బైక్ వెనక కూర్చున్నారు.
"కాళ్ళ గారు ఎక్కడ ఉంటారు తాత" అంటే.. "పాండురంగాపురం" దగ్గరకు పద" అన్నారు. ముందే ఫోన్ చేసి ఎక్కడికి రావాలో కనుకుంటుతున్నాడు తాత.
దారిలో వెళ్తుంటే అడిగాను "కాళ్ళ" అంటావు... అసలు పేరేంటి?" అని.
"కాళ్ళ సత్యనారాయణ" అన్నారు శివకోటి గారు. ఇంకా "వాడిది ఏలూరు.. చిన్నప్పటి నుండి బొమ్మలేయ్యడం అలవాటు లాంటి పిచ్చి. బ్రతకడం రానోడు. రిక్షాతొక్కాడు. మెకానిక్ షాప్ లో పనిచేశాడు. అబ్బో చాలా పనులు చేసాడు. వీడి బొమ్మలేసే విద్య చూసి పత్రికలోళ్లు తీసుకెళ్లి ఆర్టిస్ట్ గా పెట్టుకున్నారు కూడా. అక్కడ రాజకీయాలు నచ్చక, తప్పులేకపోయిన మాట పడే మనస్తత్వం కానోడు కాబట్టి ఎక్కడా ఇమడలేక పోయేవాడు. మా హరీష్ కు పరిచయం. వీడి గురించి, వీడి మనస్తత్వం గురించి తెలిసినోడు కాబట్టి ఖమ్మం రమ్మని వీడిని జాగ్రత్తగా చూసుకునే వాడు" అని చెప్తుంటే ఇక కాళ్ళ గారిని చూడటం ఎప్పుడా అనుకున్నా. నవలలో హీరో ఎలా ఉంటాడో అలా ఉన్నాడే ఈయన అనిపించింది.
పాండురంగాపురం మెడికల్ షాప్ దగ్గర ఆగగానే బక్కపలుచగా ఉన్న ఒకవ్యక్తి పాత సైకిల్ నెట్టుకుంటు మాదగ్గరకు వచ్చి "నమస్కారం సర్" అంటూ శివకోటి గారిని పలకరించారు.
"కాళ్ళా బాగున్నవా?" అన్నారు శివకోటి గారు.
"ఆ" అని.... నన్ను చూస్తూ "ఈ బాబు" అన్నారు కాళ్ళ గారు.
"వీడు రెడ్డి. చిన్న కవితలు, ఒకటి రెండు కథలు రాసాడు. సాహిత్యమంటే ఇష్టమున్నోడు" అంటుంటే... "నమస్తే సర్" అన్నాను.
కాళ్ళ గారిని చూస్తుంటే "కాసుకు అమ్ముడుపోని కళ" ఒక మనిషి దగ్గర ఉంటే ఆ మనిషి ఇలా సాదా గా, నిర్మలం గా, అన్నింటికి మించి సంతృప్తిగా ఉంటారేమో అనిపించింది.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.