Saturday, December 1, 2018

Some friends

కాళ్ళని కలసి  ఎన్నో సంవత్సరాలు అయినా పాత జ్ఞాపకాలు వల్ల ఎంతో సన్నిహితం గా మనసుకి అనిపించేది. ఏటి గట్టున వాళ్ల ఇంటికి రమణతో చాలా సార్లు వెళ్ళాను. కాళ్ళ పాట, కాళ్ళ గీత ఎప్పటికీ మరచి పోలేనివి. చాలా బాధగా అనిపిస్తోంది కాళ్ళ లేడు అనుకుంటే .......  శారద

--------------------
మహాశయులారా. కాళ్ళగారు బ్రతికివుండగానే ఆయన పెయింటింగ్ లూ వ్యాసాలతో ఒక పుస్తకం వేదామని నేనూ అనిల్ (తెలుగు రీడర్స్ క్లబ్)అనుకుని కాళ్ళాగారి అనుమతి కోరాం.ఆయన తనదగ్గరున్న పెయింటింగ్ ల ప్రతులు మాకిచ్చి తన గురించి ఫలానా ఫలానా వారైతే ఎరుకతో రాయగలరని చెప్పారు. మేము వెంటనే వారందరికీ ఫోన్ చేసి వ్యాసాల కోసం అడిగాము.వారెవ్వరూ సీరియస్ గా స్పందించలేదు. మేమా విషయం కాళ్ళ గారికి చెప్పి వ్యాసాలు కోరిన వారంతా మీ హితులే కనుక మీరు అడిగి చూడండి అన్నాం.ఆయన నవ్వి..... వూరుకున్నారు. ఇదంతా పది నెలల కథ.  నిన్న ప్రకాష్ గారూ,అన్వర్,అనిల్ మరికొద్ది మంది ఓ మాట అనుకుని స్మరణిక వేదామనీ ఒక సంతాపసభ వెంటనే నిర్వహిద్దామనీ, కమ్మ్యూననికేషన్ కోసం ఈ గ్రూప్  అన్వర్ గారి చొరవతో ప్రారంభించాము. ఈ గ్రూప్ సహకారంతో సక్రమంగా కాళ్ళగారి సంస్మరణ సంచిక తెద్దాం.....తెద్దాం.
--Gangadhra rao kasupu

--------------------


ఏలూరు లో ఏటి ఇసుక తిన్నెల మీద వెన్నెల రాత్రులలో కాళ్ళ గారి పాటలు వింటూ గడపడం ఈ జీవితం లో ఒక అపురూపమయిన ,అందమయిన అనుభవం .ఆ స్నేహ బృందం లో ఒక దానిని అయినందుకు గర్వ పడుతున్నా.

గొప్ప కళాకారుడు, మంచి మనిషి అయిన కాళ్ళ గారి స్మృతి కి నా హృదయ పూర్వక నివాళి
ఝాన్సీ[v Jhansi lakshmi]
-----------------------------

కాళ్ళ గారితో నాపరిచయం కొన్నిరోజులు మాత్రమే అయినా మీరు చెప్పిన మీ బృందంతో నా అనుభందం చాలా ఎక్కువ.ముఖ్యంగా మీరు రమణ చాలాసార్లు కాళ్ళ గారి విషయం చెప్పేవారు. ఇదే మిత్రులతో చైతన్య వేదిక నడుస్తోంది. కాబట్టి అందరం కలసి మన; జ్ఞాప కాల్లో నుండి కాళ్ళ గారిని మన మద్యకు తెచ్చుకుందాం. మిత్రలందరికీ ఆలోచింవలసిందిగా నా విన్నపం..చంద్[chaitanya vedika, elluru]

-----------------

కాళ్ళా ఓ జ్ఞాపకమైపోయావా.....      ఆనాటి నావోడు సెందురూడా....అలిగి రాలేదోయి సెందురూడా....1976లో ఏలూరు y m h a. హాల్ లో జరిగిన  పార్టీ మీటింగ్ లో కాళ్ళా నేనూ డాన్స్ చేశాము...నా కాసి చూస్తాడు నవ్వు నవ్విస్తాడు..దగ్గరకు పోతుంటే...అగ్గి చూస్తాడే..నన్నగ్గి చూస్తాడే....( విజయవాడ మాజీ మేయర్ శకుంతల కాళ్ళ తో తన అనుబంధాన్ని ఇలా వ్యక్తం చేశారు......భాషాంతరీకరణ గంగాధర్)
-------------------------------




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.