Saturday, December 8, 2018

Kalla by Surendra cartoonist

పో!పోతే పో..
ఇంకో ఇరవై యేళ్ళు ఉంటానని అన్న వారానికే బయల్దేరేశావ్. నీకేం, ఇస్త్రీ బట్టలు సర్దుకునేదుందా,సేవింగ్ సెట్ పెట్టుకునేదుందా,ఏటీఎం కెల్లేదుందా...ఉన్నపాటున బయల్దేరగలవ్.
ఎవరున్నారు నిన్ను భరించే వాళ్ళక్కడ? ఇక్కడైతే నేనో, శీనో ఉన్నాం.రాత్రుల్లంతా పాటలు వింటూ, మాటాడుకుంటూ, ఇప్పుడు పోతే మీరు మళ్లీ రారంటూ ప్రతినిమిషాన్ని జుర్రుకునేందుకు ఎవరున్నారక్కడ? సరే..పో! ట్రై చెయ్..నిన్నెవరు భరిస్తారక్కడ? పగలంతా శ్రద్ధగా
వింటావ్, రాత్రయిందా...పగలైతే దొరవేరా..రాతిరి నా రాజువురా..
రాజు తలుచు కుంటే కొరడా దెబ్బలకేం కొదవ?నువ్వది చేయలేదు, ఇదిచేయలేదు" అబ్బబ్బా..నిన్ను భరించడం కష్టం. ముప్పైతొమ్మిదేళ్ళు
ఏం మాటాడుకున్నాం..ఏమీ గుర్తు రావడం లేదే.సర్ ప్రైజ్ ఇద్దామని

చెప్పా పెట్టకుండా లెక్క లేనన్ని సార్లు ఇంటికొస్తే, ఏ మాత్రం ఆశ్చర్యపడకుండా..దా.. బాబూ..ఏమన్నా తిన్నావా.. అనడుగుతావ్.
నీ పాసుగూలా ఇదేందయ్య అంటే, "నువ్వు, శీను ఈ ఇంట్లో లేందెప్పుడయ్యా" అంటావ్.
అవన్నీ ఇప్పుడెందుకులేగానీ..కలిసినప్పుడు మాటాడుకుందాం.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.